Leading News Portal in Telugu

IPL 2024: కెప్టెన్ ను ప్రకటించిన ఢిల్లీ.. ఎవరంటే..?



Pant

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ జట్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో ఢిల్లీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు.. గత సీజన్ లో రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనబడింది. చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ప్లేఆఫ్ కు ఎంపిక కాకుండానే జట్టు నిష్ర్కమించింది. ఈ క్రమంలో.. రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. చూడాలి మరీ.. రిషబ్ పంత్ సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకెళ్తుందో.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు విశాఖలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. డీసీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్రాక్టీస్ చేశారు. ఈసారి ఐపీఎల్ మ్యాచులకు విశాఖ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌ స్టేడియం ఢిల్లీ జట్టుకు హోమ్‌ గ్రౌండ్‌గా ఉంది. ఈ సీజన్‌లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో జరగనుండగా.. అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే షెడ్యూల్ చేయబడ్డాయి.