Leading News Portal in Telugu

Ponnam Prabhakar: ఈటలకు.. బండి సంజయ్ కి పడదు..!



Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఈటలకు.. బండి సంజయ్ కి పడదని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఔట్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఫైట్ అన్నారు. అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించిందో ..? బండి సంజయ్ చెప్పాలన్నారు. బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు.. కరీంనగర్ నుండి ఇప్పటి వరకు ఎవరికి అలాంటి పేరు రాలేదన్నారు. ఈటలకు.. బండి సంజయ్ కి పడదన్నారు. ముందు కరీంనగర్ ప్రజలకు ఏం చేశావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కి గంగుల కమలాకర్ కి ఎంత సన్నిహిత్యమో అందరికి తెలుసన్నారు. వర్షాలు పడాల్సింది సెప్టెంబర్ లో అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ అన్నారు. మేము అధికారం లోకి వచ్చింది డిసెంబర్ లో అది వర్షాకాలం కాదన్నారు. అయినా దానికి బాద్యులు వాళ్ళని మేము అనట్లేదన్నారు. పంట నష్టం గురుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆస్కార్ అవార్డు పొందాలంటే ఎంత తాపత్రయం పడుతారో.. నటనలో బండి సంజయ్ అంత తాపత్రయం పడుతున్నారని వ్యంగాస్త్రం వేశారు.

Read also: Swarna Sudhakar Reddy: బీఆర్‌ఎస్‌ కు షాక్‌.. కాంగ్రెస్‌ లోకి మహబూబ్‌ నగర్‌ జడ్పీచైర్‌ పర్సన్‌

కారణం లేకుండా నా మీద ఆభాండం వేసాడని మండిపడ్డారు. అందుకే నేను సజీవ దహనం కి సిద్ధం అన్నాను అని తెలిపారు. నిరూపించలేక పోయారు కాబట్టే సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. బండి సంజయ్ అవినీతి పరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ గురించి పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ చూసుకుంటారని తెలిపారు. నా వాయిస్ రికార్డ్ చేసిన ఎమ్మార్వో మీద చీఫ్ సెక్రెటరికి ఫిర్యాదు చేశానని, చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నగర తాగు నీటి అవసరాలకు సింగూర్ నుండి 18 శాతం, గోదావరి నుండి 35 శాతం కృష్ణా నుండి 45 శాతం ,ఉస్మాన్ సాగర్ నుండి 4 శాతం నీటిని వాడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్లు ఉన్నవి, అవసరమైతే బూస్టర్ పైప్ ల ద్వారా వాటర్ తరలిస్తామన్నారు. ఎల్లం పల్లి నుండి కూడా 3 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నామని తెలిపారు. ప్రకృత్తి కరువు ఎదుర్కోవడానికి ప్రతి పక్షాలు సహకరించాలని, పోయిన సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదని అన్నారు. 2022-23 వెదర్ రిపోర్ట్ ప్రజలకు తెలియజేస్తామన్నారు.
Bandi Sanjay: పంట నష్టంతో అప్పులు తీరే పరిస్థితి లేదు.. బండి సంజయ్‌ తో రైతులు