Leading News Portal in Telugu

Siddharth Roy : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ్ రాయ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?



Whatsapp Image 2024 03 20 At 2.56.02 Pm

చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజైంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను గుర్తుచేసిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది.హీరో క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయ్యారు. ప్రేమకథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు లోనయ్యాడు. దీనితో సినిమా కమర్షియల్ గా సక్సెస్‌ సాధించలేకపోయింది. అయితే సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్సవ్వడం కూడా సినిమా ఫెయిల్యూర్‌కు కారణమైందని తెలుస్తుంది.సిద్ధార్ రాయ్ లాజిక్ ప్రకారమే లైఫ్‌ను కొనసాగిస్తుంటాడు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తన అవసరాలు తీర్చుకుంటూ సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఇందు అనే అమ్మాయి పరిచయంతో సిద్ధార్థ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? సిద్ధార్థ్‌ను ప్రాణంగా ప్రేమించిన ఇందు అతడికి ఎందుకు బ్రేకప్ చెప్పింది అన్నదే ఈ మూవీ కథ.

చాలా ప్రాక్టికల్‌గా బతికే ఓ యువకుడు ప్రేమ, బంధాల విలువ ఎలా తెలుసుకున్నాడనే పాయింట్ దర్శకుడు బాగా రాసుకున్నా కానీ దానిని అర్థవంతంగా చెప్పలేకపోయాడు.హీరోగా దీపక్ సరోజ్‌కు ఇదే ఫస్ట్ మూవీ అయినా అతడి యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చాయి. గతంలో దీపక్ సరోజ్‌ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మిణుగురులు సినిమాకుగాను నంది అవార్డును అందుకున్నాడు.సిద్ధార్థ్ రాయ్ మూవీలో తన్వినేగి హీరోయిన్‌గా నటించింది. యశస్వీ దర్శకత్వం వహించాడు. గౌతమబుద్దుడి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ మూవీ కథను రాసుకున్నాడు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. సిద్ధార్థ్ రాయ్‌ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ రథన్ మ్యూజిక్ అందించాడు. సిద్ధార్థ్ రాయ్ మూవీ మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దీపక్ సరోజ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి యశస్వీ దర్శకత్వం వహించాడు.