Leading News Portal in Telugu

Jaishankar: “నెహ్రూ అమెరికా వ్యతిరేకి”.. కాంగ్రెస్ విదేశాంగ విధానంపై జైశంకర్..



Jai Shankar

Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ అమెరికా వ్యతిరేకి కాబట్టి అందరూ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. 1950లో చైనాకు దగ్గరగా ఉంటూ అమెరికాను దూరం చేశారని మండిపడ్డారు. నెహ్రూ చైనా గొప్ప మిత్రుడని అంటుంటారు. ఈ రోజు కూడా మీకు చిండియా అనే భావన ఉందని అన్నారు. నెహ్రూ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రశ్నించారు. 1950లో చైనా తరుపున వాదించడం వల్ల అమెరికాతో భారతదేశ సంబంధాన్ని చెడగొట్టుకున్నామని అన్నారు.

Read Also: Kareena Kapoor: బాలీవుడ్ కుర్ర భామలే కాదు.. ముదురు భామలు కూడా సౌత్ ని వదలట్లే?

నెహ్రూ విదేశాంగ విధానం నిందలకు అతీతం కాదని చెప్పారు. నెహ్రూ విదేశాంగ విధానం ఉన్నతమైందని, ఈ రోజు కూడా దానిని అనుసరించాలని, ఎవరూ అధికారంలోకి వచ్చినా దానిని పాటించాని చెప్పడం తప్పని జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ సంబంధాలను జైశంకర్ ప్రశసించారు. మోడీ గ్యారెంటీ భారతదేశంలో మాదిరిగానే విదేశాల్లో పనిచేస్తుందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి ప్రశ్నించినప్పుడు.. సీఏఏని మన చరిత్ర నిర్ధిష్ట పరిస్థితిని సరిదిద్దడానికి, విభజన సమయంలో అటువైపు చిక్కుకున్న వ్యక్తుల పట్ల న్యాయం చేసేందుకు తీసుకువచ్చామని చెప్పారు.