
Russia: యుద్ధం వద్దన్నందుకు ఓ యువతికి రష్యాలో జైలు శిక్ష విధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్ వ్యతిరేక ప్రచారానికి నిరసనగా, దేశ అధ్యక్ష ఎన్నికల్లో నిరసగా బ్యాలెట్ పేపర్‌పై ‘నో వార్’ అని రాసింది. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్‌కి చెందిన మహిళకు రష్యా బుధవారం 8 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ ఘన విజయం సాధించారు. ఆరేళ్ల పాటు రష్యాకి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. 2030 వరకు ఇతని పాలన కొనసాగనుంది.
Read Also: Shobha Karandlaje: తమిళనాడుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్రమంత్రిపై చర్యలకు ఈసీ ఆదేశం..
బ్యాలెట్ పేపర్‌పై యుద్ధ వద్దని రాసినందుకు సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని డిజెర్జిన్స్కీ జిల్లా కోర్టు అలెగ్జాండ్రా చిర్యాటియేవా అనే యువతికి 8 రోజుల జైలు శిక్షతో పాటు 40,000 రూబిళ్ల జరిమానా విధిస్తూ ఆదేశించింది. ఆమె రష్యన్ సాయుధ దళాలనున అప్రతిష్టపాలు చేసిందని కోర్టు పేర్కొంది. ఆమె ఓటింగ్‌లో పాల్గొనే సమయంలో బ్యాలెట్ పేపర్ వెనకవైపు ఎరుపురంగులో ‘‘యుద్ధం వద్దు’’ అని రాసిందని కోర్టు పేర్కొంది.