
AP CEO Mukesh Kumar Meena: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు.. ఆ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ఆ టీజర్ చూస్తే కానీ మేం చెప్పలేమన్నారు. ఇక, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అంశాలను ఈ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ-విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగలు తీసేశామన్నారు. గత మూడు రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణను అరికట్టాం.. వాటిని సీజ్ చేశామని ఆయన చెప్పారు. రోజువారీ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాం.. ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగితే ప్రలోభాలకు మద్య వినియోగం జరిగినట్టే భావిస్తాం.. సీ – విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 100 నిమిషాల్లోపు పరిష్కరించిన ఫిర్యాదులు 74 శాతం మేర ఉన్నాయని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు.
Read Also: Atchannaidu: వచ్చే ఎన్నికల్లో వారికి ఘోర పరాజయం తప్పదు..
నిన్నటి వరకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా చెప్పారు. తప్పిదానికి పాల్పడిన వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్యోగం నుంచి తప్పించాం.. తప్పులు చేసిన ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశాం.. స్వయంగా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రి సభలో భద్రతా వైఫల్యం అంశం మా పరిధిలోకి రాదు.. నాకు వచ్చిన కంప్లైంటుని హోం శాఖ కార్యదర్శికి పంపాను.. ఆయన దర్యాప్తుకు ఆదేశించారు.. మేం పక్కకు తప్పించిన వాలంటీర్లను.. రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవచ్చా..? లేదా..? అనే అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తామని ఎంకే మీనా పేర్కొన్నారు. అలాగే, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నాకు పెద్ద ఎత్తున ఫోన్లు, మెయిల్స్ వస్తున్నాయి.. డీఎస్సీ నిర్వహణను వాయిదా వేయాలని వస్తున్న రిప్రజెంటేషన్లపై విద్యా శాఖ దృష్టికి తీసుకెళ్లాం.. ఈసీఐ నిర్ణయం ప్రకారం డీఎస్సీ నిర్వహణపై చర్యలు ఉంటాయన్నారు. ఈసీ ఒప్పుకుంటేనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా తెలిపారు.
Read Also: Allu Arjun: బన్నీకి ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకబ్బా?
గత రెండు రోజుల్లో మూడు జిల్లాల పరిధిలో పొలిటికల్ వయొలెన్స్ జరిగింది అని ఏపీ సీఈఓ ఎంకే మీనా తెలిపారు. ఆళ్లగడ్డ, గిద్దలూరుల్లో రెండు హత్యలు జరిగాయి.. మాచర్లలో ఓ పొలిటికల్ పార్టీకి చెందిన కారును తగులపెట్టారు.. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను రేపు సీఈఓ కార్యాలయానికి రమ్మన్నాం.. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరతామన్నారు. ఆ మూడు జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ హింస లేకుండా ఎన్నికలు జరపాలని మేం నిర్ణయించాం.. పొలిటికల్ వయొలెన్సును ఎంజరేజ్ చేయొద్దని ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు.