
Vishwambhara Huge Action sequence in Muddy Water without a dupe by Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత ఎదిగారో అంతే ఒదిగి ఉంటారు. అందుకే ఎలాంటి సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినా సరే ఈరోజు సినీ పరిశ్రమ మొత్తానికి ఒక పెద్దగా ఎదిగారు. తాను సినీ పరిశ్రమ పెద్దని కాదు బిడ్డని అని ఆయన చెప్పుకున్నా సరే సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని ఒక పెద్దగా భావిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన తన తాజా చిత్రం కోసం ఒక రిస్కీ షాట్ షూట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా త్రిష నటిస్తోంది.
Telugu OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులలోని ఒక చెరువు దగ్గర్లో జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక హెవీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఆయన అదే చెరువులో దిగి ఫైట్ చేసినట్లుగా చెబుతున్నారు. దానికి అది వాడుకలో లేని చెరువు, దీంతో అక్కడ ఎక్కువగా బురద పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. రిస్క్ అని తెలిసినా సరే వెనకడుగు వేయకుండా డూపులను వాడకుండా ఆయన కావాలని ఈ రిస్కీ షాట్ లో షూట్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఫిలింనగర్ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి షూట్ లో పాల్గొంటున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా మెగాస్టార్ చిరంజీవి లీక్ అయిన ఫోటోలు, వీడియోలు చూసేయండి