Leading News Portal in Telugu

Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న పవన్‌ కల్యాణ్‌.. రోడ్డెక్కనున్న వారాహి..



Pawan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్‌ పెడుతున్నాయి.. అధికార, ప్రతిపక్షాలు.. ఎన్నికల ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఇక, టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో కీలక భూమిక పోషించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి జనసేనాని శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. అంటే గతంలో వారాహి ఎక్కి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ప్రభుత్వ విధనాలు, వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఎన్నికల తరుణంలో ఇప్పుడు మరోసారి ఆంద్రప్రదేశ్‌లో వారాహి రోడ్డెక్కనుంది..

Read Also: Thummala Nageswara Rao: ప్రతి రైతుకు రూ. 10, 000 ఇస్తాం..

ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారట.. తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్‌ కల్యాణ్‌ ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవైపు.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభలు, సమావేశాల్లో పాల్గొంటూనే.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారట.. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తారని చెబుతున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్ బరిలోకి దిగనున్న విషయం విదితమే. పిఠాపురంలో ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు పవన్ కల్యాణ్..