
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. సంభాల్ నుంచి జియావుర్ రెహమాన్ బుర్క్, బాగ్‌పత్ నుంచి మనోజ్ చౌదరి, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాహుల్ అవానా, పిలిభిత్ నుంచి భగవత్ సరణ్ గంగ్వార్, ఘోసీ నుంచి రాజీవ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఇక, అలాగే, మీర్జాపూర్ నుంచి రాజేంద్ర ఎస్ బింద్ ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తారని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్!
అయితే, మొత్తం ఏడు దశలలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగబోతుంది. దీంతో అభ్యర్థులకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ ఇప్పటి వరకూ ఐదు జాబితాలను ప్రకటించగా ఇది ఆరో జాబితా అన్నమాట. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య ఇప్పటి వరకు 47కు చేరుకుంది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి సమాజ్ వాదీ పార్టీ ఇచ్చింది. ఇక, ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇచ్చింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నాయి.