Leading News Portal in Telugu

Congress: కాసేపట్లో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా.. అభ్యర్థుల్లో టెన్షన్



Cng

Congress: గెలుపే లక్ష్యంగా 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాదించ గలిగే ప్రజా బలం కలిగిన నాయకులకే టికెట్లను ఇచ్చే దిశలో కాంగ్రెస్ అధి నాయకత్వం ముందుకు వెళ్తుంది. ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులనే ఎన్నికల బరిలో దించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇక, కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల కానుంది.

Read Also: Allu Arjun : సౌత్‌లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో, హస్తం పార్టీ నేతల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే, ఈరోజు ఉదయం 11: 30 గంటలకు కాంగ్రెస్‌ మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. ఇక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లోక్‌సభ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించనుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల అంచనా పేర్లు..

నాగర్ కర్నూల్ : మల్లు రవి
చేవెళ్ల : రంజిత్ రెడ్డి
పెద్దపల్లి : గడ్డం వంశీ
మల్కాజ్ గిరి: పట్నం సునీత మహేందర్ రెడ్డి
నిజామాబాద్ : జీవన్ రెడ్డి
కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి