Leading News Portal in Telugu

Bengaluru Water Crisis: బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నీటి కష్టాలు.. నీటి క్యాన్లతో ఆర్ఓ కేంద్రాల వద్ద క్యూ



Congress

Bengaluru Water Crisis: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఏర్పడిన తాగు నీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతిలో పట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల దగ్గర వేచి ఉంటున్నారు. ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పాడిందని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. నీటి కష్టాలపై ఐటీ నిపుణులు తమ బాధలు, ఇబ్బందులను సోషల్‌ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి అనిమతి ఇచ్చాయి. దీంతో కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి తమ సొంత ఊర్లకు పయణం అవుతున్నారు.

Read Also: Telepathically -Elon Musk: మెదడులోని చిప్‌ సాయంతో చెస్‌ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!

అయితే, నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి బెంగళూరు నగరంలో నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉదయాన్నే మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సర్వ సాధారణమై పోయాయి. అనేక అపార్ట్‌మెంట్లలో నీటి రేషన్‌ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చారు. నీటిని నిర్ణయించిన స్థాయిలోనే ఉపయోగించాలి.. ఎక్కువగా వాడితే జరిమానా వేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు అని వారు వాపోతున్నారు.

Read Also: The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?

ఇక, రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పూర్తిగా ‘ట్యాంకర్‌ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గడువు పూర్తైన ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేక అధిక రేట్లు వసూలు చేస్తున్నారని విపక్ష పార్టీలు అంటున్నారు. ప్రైవేట్‌ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజా సమస్యలకు స్పందించాలని విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి.