
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే కంగువపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇందులో సూర్య లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక సూర్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ గా అలరిస్తున్నాడు. ఇకపోతే ఇందులో సూర్య ఒక యోధుడిగా కనిపించనున్నాడు. నిన్నటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ లైన్ వైరల్ గా మారింది. పూర్తీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా శివ ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
రెండు ట్రైబల్ లీడర్స్ మధ్య జరిగే అధికార పోరుగా ఈ సినిమా సాగుతుందట. 1678లో అత్యంత క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపిస్తాడు. అయితే ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయం తీసుకొని భూమి మీదకు వస్తాడు. ఇక్కడ అతడిలో పరివర్తన మొదలై.. తిరిగి తన లోకానికి వెళ్లి ఆ మిషన్ ను ఎలా కంప్లీట్ చేశాడు అనేదే కథ అని చెప్తున్నారు. ఈ లైన్ వినగానే తెలుగువారికి బింబిసార సినిమా గుర్తుకు వస్తుంది. అందులో కూడా క్రూరమైన రాజు భూమి మీదకు వచ్చి మారి.. పైకి వెళ్తాడు. ఇక్కడ సూర్య మిషన్ కోసం వస్తాడు. ఇక ఈ లైన్ వినడంతోనే కొంపతీసి బింబిసారకు రీమేక్ కాదుకదా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.