Leading News Portal in Telugu

Navjot Singh: టీమిండియా బ్యాటర్లలో టాప్ ప్లేయర్ అతనే..



Navajyoth

టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కామెంటరీ చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఐపీఎల్‌ 2024 సీజన్‌ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో.. సిద్ధూ ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగలడని చెప్పాడు. ఆట సమయంలో విరాట్ కోహ్లీ వైఖరి, దూకుడు, ఆత్మవిశ్వాసం అద్భుతమని సిద్ధూ పేర్కొన్నాడు.

Kakarla Suresh: ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఇకపోతే.. భారత్‌ తరఫున అద్భుతంగా ఆడిన బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సునీల్ గావస్కర్, సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరుల్లో ఎవరు బెస్ట్‌ అనేది తన మనసులో మాటను బయటపెట్టాడు. అంతేకాకుండా.. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ మూడో స్థానంలో దిగడమే మంచిదని వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లో ఎక్కువ శాతం కోహ్లీ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. ఇకపోతే.. ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఇప్పుడు అదంతా వదిలేసి ఆర్సీబీ తాజాగా మొదలుపెట్టాలని సిద్ధూ అన్నాడు.

Supreme court: తమిళనాడు గవర్నర్ తీరుపై మండిపడ్డ ధర్మాసనం

కోహ్లీని తక్కువ చేయడం కాదు. తన జట్టు కోసం అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే, అతడిని భారత్‌ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నేను ఎంపిక చేస్తానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపాడు. మరోవైపు.. కోహ్లీ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని అన్నాడు. కోహ్లీకి పదహారు కళలు ఉన్నాయని సిద్ధూ అభివర్ణించాడు. క్రికెట్ ఫీల్డ్‌లో షెర్రీగా పేరుగాంచిన సిద్ధూ.. ఈ ఆటగాడు ఏది సాధించినా.. పరిస్థితులకు తగ్గట్టుగా కళాత్మకంగా వ్యవహరించడమే అన్నిటికంటే ముఖ్యం అని తెలిపాడు.