
హోలీని చిన్న నుంచి మొదలుపెడితే పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. రంగు రంగు రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. బంధువులు, స్నేహితులు అంతా కలిసి ఈ కలర్ ఫుల్ హోలీని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. ఒకప్పటిలా నేచురల్గా తయారుచేసిన రంగులతో జరుపుకోవడం కాకుండా.. అంతా కెమికల్ తో తయారయ్యే రంగులను చర్మానికి పూసుకుంటున్నారు. దానివల్ల చర్మం, జుట్టు పాడవుతుంది. అయితే అలా కాకుండా.. చర్మాన్ని, జుట్టును కాపాడుకోవడం కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.. అలా చేయడం వల్ల జాగ్రత్తగా ఉండొచ్చు.
Watermelons: రాత్రి పూట పుచ్చకాయ తింటున్నారా? ఏం అవుతుందో తెలుసా?
ఇంతకు ముందు రోజుల్లో హోలీ వచ్చిందంటే సహజ పద్థతిలో రంగులు తయారుచేసుకుని ఆడుకునేవారు. కానీ.. ఇప్పుడు కెమికల్స్ వాడిన రంగులు వాడుతున్నారు. ఈ క్రమంలో.. చర్మానికి, జుట్టుకు ఇబ్బందిని ఏర్పరుస్తాయి. నీటిలో కలిపి రంగులు చల్లిన తర్వాత.. అవి ఆరిపోయిన తర్వాత నష్టాన్ని కలిగిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Pakistan: మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పాక్.. తలనొప్పిగా మారిన తాలిబాన్
స్కిన్ కోసం..
హోలీ ఆడే ముందు స్కిన్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఉదయాన్ని ముఖాన్ని క్లీన్ చేసి రోజ్ వాటర్, పచ్చి పాలతో క్లెన్స్ చేయండి. తర్వాత టోనర్ అప్లై చేయండి. దీంతో మురికి, జిడ్డు తొలగిపోతుంది. తర్వాత ముఖం, మెడ, చేతులు, పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
ఆయిల్..
హోలీ ఆడటానికి ముందు జుట్టు, చర్మానికి కచ్చితంతగా ఆయిల్ ను పెట్టుకోవాలి. బాదం, కొబ్బరినూనె ఏదైనా అప్లై చేసుకుంటే మంచిది. ఇవి మీ జుట్టుకు, చర్మానికి రక్షణ పొరలా ఉండి.. హోలీ కలర్స్ వల్ల ఎఫెక్ట్ పడకుండా చూస్తాయి. రంగులలో ఉండే కెమికల్స్ చర్మం, వెంట్రుకల్లోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా.. ఆయిల్ పెట్టుకోవడం వల్ల కలర్స్ తొందరగా పోతాయి.
సన్‌స్క్రీన్..
సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు. SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడటం వల్ల ఎండ నుంచి కాపాడుకోవచ్చు. యూవీ కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం SPF 40 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ తీసుకుని ప్రతి రెండు గంటలకి ఓసారి స్కిన్‌కి రాసుకోవాలి.
సబ్బుతో కడగవద్దు
ఒంటిమీది రంగులు శుభ్రం చేసుకునేటప్పుడు ముఖాన్ని సబ్బుతో కడగవద్దు. దీనివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. సబ్బుకు బదులుగా క్లెన్సింగ్ క్రీమ్, లోషన్ ఉపయోగించడం ఉత్తమం. వాటిని ముఖానికి రాసుకున్న తర్వాత తడి దూదితో మెత్తగా తుడవాలి.
పాలతో కడగాలి
హోలీ తర్వాత చర్మం పూర్వస్థితికి రావడానికి ఒక చిట్కా ఉంది. కప్పులో సగం వరకూ పాలు పోసుకుని అందులో నువ్వుల నూనె వేసి, బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. లేదంటే అరకప్పు పెరుగులో రెండు చెంచాల తేనె కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.