Leading News Portal in Telugu

Mukhtar Ansari: జైల్లో నాకు స్లో పాయిజన్ ఇస్తున్నారు.. కోర్టుకు ముఖ్తార్ అన్సారీ దరఖాస్తు



Mukthar

నకిలీ అంబులెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గురువారం బారాబంకి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ముఖ్తార్ అన్సారీ కోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చారు. జైల్లో తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అన్సారీ ఈ దరఖాస్తులో ఆరోపించారు. ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాగా.. తనకు వైద్యం చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్సారీ కోర్టును అభ్యర్థించారు.

ఈ అంశంపై.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ తరపు న్యాయవాది ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులో ముఖ్తార్ అన్సారీకి మార్చి 19వ తేదీ రాత్రి ఆహారంలో విషపూరితమైన పదార్ధం వేశారని తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుండి అతను చాలా ఉద్విగ్నంగా ఉన్నాడని పేర్కొన్నారు. అంతకు ముందు.. ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగానే ఉంది న్యాయవాది తెలిపారు. ఇదిలా ఉంటే.. 40 రోజుల క్రితం కూడా తనకు ఇలాగే విషం కలిపిన ఆహారం ఇచ్చారని అన్సారీ ఆరోపించారు.

Delhi Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..? ఎవరెవరు అరెస్ట్..?

గురువారం జరిగిన విచారణలో బండా జైలు నుండి ముఖ్తార్ అన్సారీ వర్చువల్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు జైలు డిప్యూటీ జైలర్ మహేంద్ర సింగ్ ఉన్నారు. ముఖ్తార్ అన్సారీ అనారోగ్యంతో ఉన్నారని, అందుకోసమని అతను విచారణకు హాజరు కాలేకపోయాడని జైలు డిప్యూటీ జైలర్ తెలిపారు. ఈ క్రమంలో.. విచారణను మార్చి 29 తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. తన న్యాయవాది ద్వారా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి తనపై విచారణ జరిపించాలని అన్సారీ కోరారు. తనకు ఆహారంలో స్లో పాయిజన్‌ ​ఇస్తున్నారని తెలిపారు.

Arvind Kejriwal: ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని ఎందుకు అరెస్ట్ చేసిందంటే..? వివరాలు..

2022 మార్చి 24న నకిలీ అంబులెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీపై గ్యాంగ్‌స్టర్ కేసును అప్పటి DM ఆమోదించారు. ఆ తరువాత.. 2022 మార్చి 25న అప్పటి నగరం కొత్వాల్ ముఖ్తార్ అన్సారీ, అతని 12 మంది సహచరులపై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదు చేశారు.