
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఈడీ సమన్లను 9 సార్లు దాటవేసిన కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. ఈ రోజు ఆయన కస్టడీ కోసం ఈడీ రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. కేజ్రీవాల్‌ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది.
Read Also: Kodandaram: కేజ్రీవాల్ను రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేసారు..
ఇదిలా ఉంటే అరెస్టైన ఒక రోజు తర్వాత, ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..‘ఈ జీవితం జాతికి అంకితం’’ అని తన స్పందన తెలియజేశారు. ఈడీ అధికారులు కోర్టుకి తీసుకెళ్తున్న క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆప్ చీఫ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి కూడా దేశం కోసం పనిచేస్తానని అన్నారు. మరోవైపు ఈ కేసులో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అంటూ ఈడీ కోర్టుకు తెలియజేసింది. సౌత్ లాబీకి లాభం చేకూరేలా ఈ పాలసీని రూపొందించారని, ఇందులో కేజ్రీవాల్ హస్తముందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సౌత్ లాబీ నుంచి రూ. 100 కోట్లను లంచంగా తీసుకున్నారని, పంజాబ్, గోవా ఎన్నికల్లో వీటిని ఉపయోగించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.