Leading News Portal in Telugu

Zomato CEO: జొమాటో సీఈవో సీక్రెట్‌గా రెండో పెళ్లి.. అమ్మాయెవరంటే…!



Goyal

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి ఏడడుగులు వేశాడు. రహస్యంగా మెక్సికో మోడల్‌ మునోజ్ గ్రెసియాను వివాహం చేసుకున్నాడు. మునోజ్ గ్రెసియా.. లగ్జరీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ స్పేస్‌లో స్వంత స్టార్టప్‌ను నడుపుతోంది. మెక్సికోలో పుట్టి పెరిగిన ఆమె.. దీపిందర్‌ గోయల్‌ని పెళ్లి చేసుకోవడంతో భారత్‌లో మెట్టింట్లో అడుగుపెట్టినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించింది.

2022 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ పోటీల్లో మునోజ్ విజేతగా నిలిచింది. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను కొన్ని నెలల క్రితం మునోజ్‌ వివాహం చేసుకున్నారు. దీపిందర్ గోయల్‌కి ఇది రెండో వివాహం. గోయల్ గతంలో ఐఐటీ ఢిల్లీలో చదువుతున్నప్పుడు పరిచయమైన కంచన్ జోషిని వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయినట్లుగానే ఉన్నట్లు సమాచారం. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

Love

ప్రస్తుతం గ్రెసియా.. తన భర్తతో ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరిలో తమ హనీమూన్‌ కూడా ముగిసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంది. తన భర్తతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఈమె ఓ టెలివిజన్‌లో హోస్టింగ్‌ కూడా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తన కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.

ఇక ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమోటో 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి మంచి లాభాలతో దూసుకెళ్తోంది. ప్రముఖ స్టార్టప్‌ల్లో జొమాటో ఒకటిగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వినియోగదారులకు విస్తృతంగా సేవలందిస్తోంది. పలు మార్లు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అయినా కూడా వినియోగదారులకు అనుగుణంగా అభివృద్ధిలో దూసుకెళ్తూనే ఉంది.

ఇది కూడా చదవండి: CSK vs RCB: చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. ప్రారంభ మ్యాచ్‌లో ప్లేయింగ్-11?

 

 

View this post on Instagram

 

A post shared by Grecia Muñoz (@greciamunozp)