Leading News Portal in Telugu

Mayor Vijayalakshmi: కాంగ్రెస్ లో చేరనున్న నగర మేయర్ విజయలక్ష్మి..?



Gadwal Vijayalakshmi

Mayor Vijayalakshmi: గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్‌ ఇంచార్జి మున్షీ, ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి సమావేశమయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పార్టీ మారతారనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే మేయర్‌ హస్తం గూటికి చేరుతారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. కాగా.. మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం బీఆర్ ఎస్ లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కోట ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతలక్ష్మి రెడ్డి ఉన్నారు.

Read also: Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

దీంతో వీరంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యేలు వాటిని ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తుండటం చర్చలకు దారి తీస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని ఎవరైనా కలవాలనుకుంటే సమాచారం అందించి వెళ్లాలని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు ప్రజల్లో ఉన్నప్పుడే కలవాలని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పగానే మేయర్ విజయలక్ష్మి సీఎంను కలవడం గమనార్హం.
DCP Rohini Priyadarshini: నా సర్వీస్ లో ఇలాంటి మహిళలను చూడలేదు.. డీసీపీ రోహిణీ