Leading News Portal in Telugu

Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత విషయంలో వైసీపీని ఏ పార్టీ దాటలేదు..



Untitled Karumuri

Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏ పార్టీ దాటలేదు అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజ్యసభలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు.. వైసీపీని చూసి తల ఎక్కడ పెట్టుకుంటారు..? అని ఫైర్ అయ్యారు. ఇక, బీజేపీ, టీడీపీలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. మమ్మల్ని విమర్శించిన చంద్రబాబు.. కడప నుంచి అభ్యర్దిని తీసుకు వచ్చి ఏలూరు పార్లమెంట్‌కు పెట్టడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కడప నుంచి ఎక్స్‌పోర్ట్‌ చేసిన వ్యక్తి యనమల అల్లుడైతే ఏలూరు ప్రజలు ఓట్లు వేస్తారా..? అని నిలదీశారు.

Read Also: Penamaluru: పెనమలూరు పంచాయితీ.. చంద్రబాబు, లోకేష్‌పై దేవినేని స్మిత ఫైర్‌

మరోవైపు.. టీడీపీ-జనసే-బీజేపీ బహిరంగ సభలపై సెటైర్లు వేశారు కారుమూరి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. వైసీపీ సిద్ధం సభలను చూసి మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీలు సభలు పెడుతున్నా ఆదరణ దక్కడం లేదన్నారు. ఇక, చంద్రబాబు నీచకృత్యాలు ఆయన అనుచరుల రూపంలో బయట పడుతున్నాయి.. డ్రగ్స్ తీసుకు వచ్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో చంద్రబాబు అనుచరులు డ్రగ్స్ పై పడ్డారని విమర్శించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని కాపులు కొరుకుంటుంటే.. కాపు పెద్దలకు ఎక్కడ సీట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.