Leading News Portal in Telugu

Gajwel: గజ్వేల్‌లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్‌..!



Gajwel Money Sized

Gajwel: గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్‌36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. అధికంగా తీసుకెళ్లినట్లయితే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలి. లేని పక్షంలో ఆ మొత్తాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని, సరైన ధ్రువపత్రాలు చూపించి బాధితులు విడిపించుకోవచ్చని తెలిపారు.

Read also: Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి..

ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం. బ్యాంకుల నుంచి రూ.ల‌క్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్ల వివరాలపై ఆరా తీయాలని సూచించారు. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి రూ.లక్షకు పైగా లావాదేవీల వివరాలను తీసుకురావాలి.వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలి.ఎన్నికల సందర్భంగా ఒకే బ్యాంకు శాఖ నుంచి వివిధ బ్యాంకులకు నగదు బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

కాగా.. ఓట‌ర్లను ప్ర‌భావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా న‌గ‌దు లావాదేవీలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. రాజకీయ పార్టీల ఖాతాల నుంచి తీసుకునే లావాదేవీలను పర్యవేక్షించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బ్యాంకు ఖాతాల నుంచి అతని భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వ్యక్తి లక్షకు పైగా లావాదేవీలను అఫిడవిట్‌లో నమోదు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రెండు నెలల ముందు జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్‌ను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. సంబంధిత వివరాలను ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
Wedding invitation: పెళ్లి కార్డుపై మోడీ ఫోటో.. బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం..!