Leading News Portal in Telugu

Prabhas : సొంత ఊరికోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభాస్?



Prabhas 1

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనే.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈయన తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు.. తనతో పనిచేసే వారంతా తనతో శమనం అని భావిస్తాడు.. అందుకే అందరితో ప్రేమగా ఉంటాడు.. ఇకపోతే సొంతూరు కోసం ప్రభాస్ ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది..

ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సొంతూరు ని చాలా బాగా చూసుకుంటాడు. ఇక తాజా గా 200 కోట్లు పెట్టి సొంత ఊరు అయినా మొగల్తూరు లో రోడ్డులు వేపించడం మొదలుపెట్టాడని తెలుస్తుంది.. తన ఊరు అభివృద్ధి కోసం గవర్నమెంట్ పూనుకోకపోవడంతో తానే ముందుకు వచ్చాడు.. తన ఊరికోసం ఖచ్చితంగా రోడ్లు భావించాలి ఫిక్స్ అయ్యారట.. అంత గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత కూడా తన సంతూరును గుర్తుపెట్టుకుని ఆ ఊరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నాడంటే ప్రభాస్ ది ఎంత గొప్ప మనస్సో కదా.. ఈ విషయం విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలల్లో నటిస్తున్నాడు.. ఆ మూవీలన్ని భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్నాయి.. త్వరలోనే కల్కి సినిమా విడుదల కాబోతుంది..