Leading News Portal in Telugu

Mudragada Padmanabham: పిఠాపురం పాలిటిక్స్‌లోకి ముద్రగడ..



Mudragada

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది.. కూటిమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండగా.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీ వంగా గీతను పోటీకి పెడుతుంది.. ఓవైపు జనసేన.. మరోవైపు వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నాయి.. ఇక, ఈ మధ్య వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్‌ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలని సూచించారు. గ్రామస్థాయి మీటింగ్ లు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు, ఇప్పటికి రాజకీయాలు చాలా మారాయని తెలిపారు. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారని అంటున్నారు ముద్రగడ.

Read Also: Robbery Video: దేవుడా.. మూర మల్లెపూల కోసం మరి ఇంతలా దిగజారాలా..?

కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను కలిశారు పిఠాపురంకు చెందిన వైసీపీ నాయకులు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు.. వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మీ ఎన్నికలు అనుకొని.. కసిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ గెలుపు కోసం నా కృషి నేను చేస్తాను.. మీ పని మీరు చేయండి అంటూ పిలుపునిచ్చారు కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. మరోవైపు.. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు అడ్డుకున్నారు అధికారులు.. పర్మిషన్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ వంగా గీత ప్రచారాన్ని అడ్డుకున్నారు.. ప్రచారం నిలిపివేయాలని సూచించడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు వంగా గీత.