Leading News Portal in Telugu

Chandrababu: గంజాయిపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..



Chandrababu

ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ సీఎంకు సిగ్గు అనిపించడం లేదా? అని దుయ్యబట్టారు.

kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. పిటిషన్ తిరస్కరణ

గంజాయికి ఏపీ కేంద్రంగా మారడం ఏపీ అధికారులకు అవమానకరం కాదా? అని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసుకైనా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం జగన్ రెడ్డి పాలనా దౌర్భాగ్యమని ఆరోపించారు. నిన్ననే 25 వేల కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డాయి.. రాష్ట్రాన్ని ఇలా అభాసు పాలు చేసిన జగన్ గ్యాంగ్ పాపాలకు ప్రజలే శిక్ష విధిస్తారని తెలిపారు. నాడు అభివృద్దిలో దేశంలో వెలిగిన మన రాష్ట్రం.. నేడు గంజాయితో చీకట్లలోకి వెళ్ళిపోయిందని ట్వీట్లో పేర్కొన్నారు.

Tweet

Anjali: నిర్మాతతో హీరోయిన్ అంజలి పెళ్లి?

విశాఖలో 25వేల కేజీల డ్రగ్స్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ను కలిగి ఉన్న షిప్పింగ్ కంటైనర్‌ను అదుపులోకి తీసుకుని.. మొత్తం సరుకును సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. “ఆపరేషన్ గరుడ”లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత డ్రగ్స్ కార్టెల్స్‌పై పోరాటంలో భాగంగా ఇంటర్‌పోల్ ద్వారా అందిన సమాచారంతో విశాఖ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సహాయంతో విశాఖపట్నం ఓడరేవులోని షిప్పింగ్ కంటైనర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో.. ఏపీలో డ్రగ్స్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. డ్రగ్స్ కు సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.