
చాలా మంది పీకలదాకా తిన్నప్పుడు అరగడం కోసం సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు.. గ్యాస్ పొట్టలోకి వెళ్తే భోజనం అరుగుతుందని అనుకుంటారు.. నిమ్మకాయ లాంటి వాటిని తాగితే అప్పటికప్పుడు ఉపశమనం కలిగించిన ఆ తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. భోజనం చేశాక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తిన్నాక కూల్ డ్రింక్స్ తతాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపులో రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ, టెంపరరీ ఫీలింగ్. కానీ, సోడా తాగితే పొట్టలో గ్యాస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
రుచిగా ఉందని అతిగా తినడం తగ్గించాలి.. దీని వల్ల కడుపులో ఉబ్బరంతో పాటు జీర్న సమస్యలు వస్తాయి. ఆహారంతో పాటు నీరు కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడం మంచిది.. కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే భోజనం చేశాక గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది.. అందులో జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది.. లేదా సోంపును తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.. ముఖ్యంగా తింటానే పడుకోవడం మానెయ్యాలి.. ఒక పది నిమిషాలు మాత్రం నడవాలి.. అప్పుడే తేలిగ్గా అనిపిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.