Leading News Portal in Telugu

Hyper Aadi Marriage: అతని వల్లే నేను సింగిల్ ​గా ఉండిపోయాను.. హైపర్ ఆది కామెంట్స్..!



Hyper Aadi Dsp

హైపర్ ఆది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బుల్లితెరపై స్టేజి ఏదైనా సరే.. ఆది పంచులు వేసాడంటే పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఆయన వేసే కామెడీ పంచలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా సంవత్సరాలుగా హైపర్ ఆది జబర్దస్త్ తో అందరి మెప్పును పొందాడు. హైపర్ ఆది కేవలం జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని అనేక సినిమాల్లో కూడా నడుస్తూ తన కామెడీ టైమింగ్ తో ప్రజల్ని భావిస్తున్నాడు. కేవలం సినిమా రంగం మాత్రమే కాకుండా ఈ మధ్య హైపర్ ఆది రాజకీయాల వైపు కూడా చూస్తున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా హైపర్ ఆది అన్న మాటలు వైరల్ గా మారాయి. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు వెళితే..

also read: Inspector Rishi : ఇంట్రెస్టింగ్ గా ‘ఇన్స్పెక్టర్ రిషి’ ట్రైలర్.. భయపెడుతున్న సన్నివేశాలు..

హైపర్ ఆది పెళ్లికి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే ఇప్పటివరకు అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు. ఇది ఇలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ గామా 2024 మూవీ అవార్డ్స్ సంబంధించిన ప్రోమోలో తాను సింగిల్ గానే ఉండడానికి కారణం ఆయనే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హైపర్ ఆది సింగిల్ గా ఉండడానికి కారణం ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అంటూ తెలిపారు. అయితే ఇది కాస్త ఫన్నీ గానే అన్నాడు.

also read: Viral Video: పట్టపగలే బాలిక పై కత్తితో దాడికి యత్నించిన యువకుడు.. చివరకి..?

దేవిశ్రీ సంగీతాన్ని అందించిన కొన్ని పాటలను చెబుతూ.. ఇలాంటి వాటివల్లే సింగల్ గానే ఉన్నానంటూ దేవి శ్రీ ప్రసాద్ తో కామెడీగా అంటాడు. అయితే ఇందుకు దేవి శ్రీ ప్రసాద్ కూడా కాస్త కామెడీగానే మరి ‘నేను కూడా సింగల్ గా ఉంటున్న’ అని అనడంతో.. ఆ కార్యక్రమంలో అన్న వారందరూ పగలబడి నవ్వేశారు. ప్రస్తుతం ఈ అవార్డ్స్ సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారింది.