
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ ను కలవాలి… ఏ పోలింగ్ బూత్ కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యచరణ రూపొందించుకోవాలి… ప్రతి పోలిన్ బూత్ గెలవాలని, ప్రతి బూత్ కి ఒక ముఖ్య నేతను సమన్వయ కర్తగా నియమించాలి.. నేను కూడా ఒక పోలింగ్ బూత్ కు కో ఆర్డినేటర్ గా ఉన్నానన్నారు. ఇక్కడి 17 సీట్లు గెలిస్తే నే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారంటీ లు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా..’రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాడు…. 6 గ్యారంటీ లు అమలు చేయలేమని రేవంత్ రెడ్డి చెప్పారు.. మోసం చేయాలని సీఎం చూస్తున్నారు ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్ కు సంబందించిన ఎన్నికలు.. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలన మోడీ 9 న్నర సంవత్సరాల పాలన పై ప్రజలకి వివరించాలి కాంగ్రెస్ చరిత్రనే అవినీతి.. సీఎం కొత్తగా అయ్యారని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు..’ అని కిషన్ రెడ్డి అన్నారు.