
MLA Varaprasad Joins BJP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీకి నేతలు షాకులిస్తున్నారు. ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కమలం గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన.. బీజేపీలోకి చేరిపోయారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. 2019లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో వరప్రసాద్‌కు అధికార పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో మేరిగ మురళీధర్‌కు అవకాశం కల్పించడంతో మనస్తాపానికి గురై బీజేపీలో చేరారు. 2014లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
Read Also: Vijayasai Reddy: ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు సీట్లే వస్తాయి.. విజయసాయి కీలక వ్యాఖ్యలు
జాతీయ పార్టీలో పనిచేయాలని భావించానని.. సేవాభావంతో ఉన్నానని.. ఇది మరో కొత్త జీవితమని వరప్రసాద్ అన్నారు. తాను ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చేస్తానన్నారు. ఎంపీగా మరోసారి తనకు తిరుపతి ప్రజలు అవకాశం ఇస్తే తాను ఎంపీగా మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తానన్నారు. నకు మరోసారి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలను చేతులు జోడించి వేడుకుంటున్నానన్నారు. అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని బీజేపీ అగ్రనేతలు చెప్పారన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిచి, ప్రజలకు మెరుగైన సేవ చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందన్నారు.