Leading News Portal in Telugu

Summer Holidays 2024: ఇంకా వేసవి సెలవులు రాలే.. అప్పుడే ట్రైన్ల బుకింగ్‌ క్లోజ్‌..!



Summer Holidyes 2024

Summer Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రాను ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక.. ఏపీలో మార్చి 18 నుంచి, తెలంగాణలో మార్చి 15 నుంచి ఒక్కరోజు తరగతులు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు అంటే ఏపీలో దాదాపు 50 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది మే 1 నుంచి జూన్ 11 వరకు పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో కూడా ఒకటి రెండు రోజులు వేసవి సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లలో సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని సీట్లు రిజర్వ్‌ కావడంతో బెర్త్‌ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా కుటుంబాలు అనేక ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. మరోవైపు ఎన్నికల కారణంగా రెండు నెలల ముందే రైల్వే సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి.

Read also: Mumbai Indians: రెండు గ్రూపులుగా విడిపోయిన ముంబై ఇండియన్స్ టీమ్.. ఎలాగో తెలుసా..?

సెలవులు వచ్చేదాకా ఇదే పరిస్థితి, అర్జంట్ పనికి ఎలా వెళ్లాలి? తలలు పట్టుకుంటున్నారు. రైల్వే రిజర్వేషన్లకు 4 నెలల ముందుగానే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్లాన్ చేస్తున్న వారు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో టిక్కెట్లు అయిపోయాయి. తర్వాత అత్యవసరంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో వెళ్లాలంటే కొన్ని స్లీపర్, ఏసీ బస్సులు మాత్రమే ఉండడంతో టికెట్ ధరలు పెంచుతున్నారు. వేసవి సెలవులకు ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైళ్లు వాటి సంఖ్యకు అనుగుణంగా పెరగడం లేదు. దీంతో పాటు మరో 10 రైళ్లు నడిపినా సీటు దొరకని పరిస్థితి నెలకొంది. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి వందే భారత్‌. కానీ అందులో 1120 సీట్లు మాత్రమే ఉండటంతో అది తెరుచుకోగానే రిజర్వేషన్ హాట్ కేకుల్లా సాగుతోంది. గోదావరి, గరీబ్రత్, కోణార్క్, ఫలక్ నుమా, విశాఖ, విశాఖ – మహబూబ్ నగర్ తదితర ఎక్స్ ప్రెస్ రైళ్లు సరిపోవడం లేదు. మరోవైపు మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. మే 9 నుంచి 12వ తేదీ వరకు అన్ని రైళ్లలో సీట్లు రిజర్వ్‌ కాగా ఒక్క సీటు కూడా లభించలేదు.
Om Bheem Bush : భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఓం భీం బుష్ ‘.. ఎన్ని కోట్లంటే?