
పాకిస్తాన్‌లోని రెండవ అతి పెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. పాక్ మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే, బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. బీఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు దిగినట్లు పేర్కొన్నారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలిపింది. కాగా, పీఎన్ఎస్ అనేది పాక్‌లోని రెండవ అతి పెద్ద నేవీ స్థావరంగా ఉంది. పాక్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలను మొత్తం ఇక్కడ నిల్వ చేస్తారు.
Read Also: MLC Kavitha: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ..
అయితే, నిన్న (సోమవారం) రాత్రి దాడి ప్రారంభం అయినప్పటి నుంచి ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని బలుచీస్థాన్ పోస్ట్ పేర్కొనింది. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. అయితే, టర్బాట్‌లోని అన్ని హస్పటల్స్ లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. డాక్టర్లను అప్రమత్తం చేశారు. ఇక, దీనికి ముందు జనవరి 29వ తేదీన గ్వాదర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై కూడా దాడి జరిగింది. ఇక, తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు చెప్పాయి.
After the passage of 7 hours, the BLA Majeed Brigade still continues to hold control of the PNS Siddiqui Naval Base in #Turbat city. Firing and explosions continue, BLA fighters reportedly destroy drone operating systems at base source police
pic.twitter.com/W68QW8w2os— Benjimen Baluch (@BaluchBenjimen) March 26, 2024