
సరికొత్త కథలతో ఫ్యామిలి ఆడియన్స్ ను అలరిస్తున్న డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన లెజెండ్ డైరెక్టర్.. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఇప్పట్లో వచ్చింటే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలుగా సెన్సేషనల్ హిట్ అయ్యేవని అంతా అభిప్రాయ పడుతుంటారు. శ్రీ ఆంజనేయం, ఖడ్గం వంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఇంకా భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవని అనుకుంటారంతా.. అయితే ఇటీవల ఓ నెటిజన్ హనుమాన్ సినిమా కన్నా శ్రీఆంజనేయం బాగుందని కామెంట్ చేశాడు..
ఈ మధ్య శ్రీఆంజనేయం సినిమాలోని కొన్ని సీన్లు ట్రెండ్ అవుతున్నాయి.. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా లేని ఆ రోజుల్లోనే సినిమాను కృష్ణ వంశీ అద్భుతంగా చూపించారని వార్తలు వినిపించాయి.. సినిమా అంతా బాగానే ఉంది కానీ నితిన్, ఛార్మి లవ్ ట్రాక్ జనాలకు నచ్చకపోవడంతోనే సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.. నెటిజన్ కామెంట్ పై స్పందించిన కృష్ణవంశీ.. ఆడియెన్స్ ఎప్పుడూ తప్పు కాదు.. వాళ్లకు సినిమా నచ్చలేదంటే.. అందులో ఏదో సమస్య ఉన్నట్టే.. వారికి సరిగ్గా రీచ్ అవ్వలేదు.. ఆడియన్స్ తప్పులేదు.. వాళ్ల వల్లే సినిమాలు బాగుంటాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు..
తాజాగా నెటిజన్ కామెంట్ చేశాడు.. సినిమా అంతా వేరే లెవల్ ఉంది.. కాన్సెప్ట్ పరంగా సినిమా అందరిని ఆకట్టుకుంది.. కానీ నితిన్, చార్మీల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ పూలు గుమ గుమ చేరని అనే రొమాంటిక్ సాంగ్ ను ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అంటూ ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ కు తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ స్పందించాడు.. ఆ సాంగ్ పెట్టడానికి కారణం నేనే.. అదో పెద్ద తప్పుగా భావిస్తున్నాను.. ఇప్పటికి బాధ పడుతున్న అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో చివరగా రంగ మార్తాండ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. కానీ హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..
That’s a BIGGEST mistake sir .. I am only responsible.. n I REGRET it … Apologies….
https://t.co/Hdfq8OoFlN
— Krishna Vamsi (@director_kv) March 25, 2024