Leading News Portal in Telugu

Israel–Hamas war: యూఎన్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం.. అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం..



Isral

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిన్న (సోమవారం) తీర్మానం ఆమోదించబడింది. ఇజ్రాయెల్ శాశ్వత మిత్రదేశమైన అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలన్న అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఈ ప్రతిపాదనను అమెరికా వీటో చేయాలని ఇజ్రాయెల్ కోరింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం UNSCలో కాల్పుల విరమణపై అమెరికా ఒక తీర్మానానికి మద్దతు ఇచ్చింది.. దీంట్లో కాల్పుల విరమణ కోసం బందీలను విడుదల చేసిందన్నారు. రష్యా, చైనాలు కలిసి ఆ ప్రతిపాదనను వీటో చేశాయన్నారు.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

ఈ రోజు అల్జీరియాతో కలిసి ఇతర దేశాలు ఈ ప్రతిపాదనను తీసుకురాగా, రష్యా, చైనా కూడా వారితో చేరాయి. అయితే ఈ ప్రతిపాదనలో కేవలం కాల్పుల విరమణ మాత్రమే ప్రస్తావించబడింది. బందీల విడుదలపై చర్చ లేదు అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అటువంటి పరిస్థితిలో అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించాలి కదా అన్నారు. పాపం అమెరికా తన విధానాన్ని విడిచిపెట్టి ఓటింగ్‌కు దూరంగా ఉంది అని పేర్కొన్నారు. వీటోను ఉపయోగించకపోవడంతో అమెరికా మొదటి నుంచి యూఎన్‌ఎస్‌సీలో తన స్టాండ్ నుంచి పారిపోవాలనుకుంటుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అంతర్జాతీయ ఒత్తిడితో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించవలసి వస్తుందని హమాస్ ఆశను నేటి ప్రతిపాదన ఇస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది.

Read Also: Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!

తన ప్రతినిధి బృందాన్ని అమెరికన్ల దగ్గరకు పంపబోనని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇక, ఇజ్రాయెల్ ఆరోపణలను వాషింగ్టన్ తిరస్కరించింది. యూఎన్‌ఎస్‌సీలో తమ విధానాన్ని మార్చుకోలేదని అమెరికా చెప్పింది. రఫా సరిహద్దులో జరుగుతున్న యుద్ధానికి ప్రత్యామ్నాయాలపై చర్చించాలనుకుంటున్నామని యూఎస్ తెలిపింది. మా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత గాజాలో యుద్ధం అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దాడిలో 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.