
SOT Attacks: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని పలు బెల్ట్ షాప్ లపై ఎస్ఓటీ టీమ్ తాట తీస్తున్నారు. 29 బెల్ట్ షాపుల్లో ఎస్ఓటీ దాడులు నిర్వహించారు. భారీగా మద్యం సీజ్ చేశారు. రూ.9.50 లక్షల విలువ చేసే 859 లీటర్ల మద్యంను ఎస్ఓటీ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కాప్స్ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హోలీ రోజు (నిన్న) సైబరాబాద్ వ్యాప్తంగా నిన్న 21 పోలీస్ స్టేషన్ల పరిదిలో 29 బెల్ట్ షాప్స్ పై SOT టీమ్స్ దాడి చేసి రూ. 6,98,500/- విలువగల 635 లీటర్ల మద్యం సీజ్ చేశారు. అత్యధికంగా బలానగర్ జోన్ పరిదిలోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 బెల్ట్ షాప్స్ నుండి 336 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు బాలనగర్ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు.
Read also: Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!
తాజాగా.. (శుక్రవారం) రాత్రి ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 7 బెల్టుషాపులపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రూ.1.56 లక్షలు విలువ చేసే 142 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్టలో 71 లీటర్లు, దుండిగల్‌లో 24.24, చందానగర్‌లో 7.8, మియాపూర్‌లో 6.7, కొందుర్గులో 12.48, కడ్తాల్‌లో 8.10, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో 11.7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజుల్లో బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమ బెల్టుషాపులపై దాడులు నిర్వహించారు. రూ.1.34 లక్షల విలువైన 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
SOT Attacks: బెల్ట్ షాప్ ల తాట తీస్తున్న ఎస్ఓటీ టీమ్.. 9.50 లక్షల మద్యం సీజ్