Leading News Portal in Telugu

Jupally Krishna Rao: చర్చకు సిద్దమా..? హరీష్ రావుకు జూపల్లి సవాల్..!



Jupalli Krishna Rao

Jupally Krishna Rao: పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్ళీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు.

పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే భీమా సౌకర్యం కల్పింస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు… ఎక్కడైనా చర్చకు సిద్ధంమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ళ పండగా… అందరి బాగోతాలు బయటపడుతాయన్నారు.

Read also: Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!

కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు రైతుల కళ్లల్లో ఆవేదన.. కన్నీళ్లు చూశామని తెలిపారు. సత్తమ్మ అనే మహిళ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని.. పైగా నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పు అయినట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అయితే ఒక్క గుంట కూడా ఎండ లేదని గుర్తుచేశారు.

సంగారెడ్డి జిల్లాలో రైతులకు బ్యాంకులు నోటీసులు పంపి లోన్ కడతారా? లేదా? అని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తామని.. అది కూడా డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలోని లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడి చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించిన విషయం తెలిసిందే..
Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!