Leading News Portal in Telugu

Udhayanidhi Stalin: ప్రధాని మోడీ ఇంటికి పంపే వరకు మేం నిద్రపోం.. డీఎంకే అధినేత కీలక వ్యాఖ్యలు..



Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు. డీఎంకేకి నిద్రలేని రాత్రులు వచ్చాయని పీఎం మోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు స్పందించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని ఇంటికి పంపే వరకు తమ పార్టీ నిద్రపోదని ఆయన అన్నారు.

డీఎంకే పార్టీకి నిద్ర పట్టడం లేదని ప్రధాని విమర్శించిన నేపథ్యంలో.. అవును మిమ్మల్ని ఇంటికి పంపే వరకు మాకు నిద్రపట్టదంటూ ఉదయనిధి సెటైర్లు వేశారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 450 ఉంటే ఇప్పుడు రూ. 1200కి పెరిగిందని, రూ. 100 తగ్గింది ప్రధాని మోడీ ఎన్నికల డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మళ్లీ సిలిండర్ల ధరను రూ. 500కు పెంచుతారని తిరువన్నామలై జిల్లాలో జరిగిన ప్రచారంలో ఉదయనిధి ఆరోపించారు.

Read Also: Pakistan: కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి

ఇటీవల ప్రధాని మోడీని ‘‘28 పైసల ప్రధాని’’ అని పిలవాలంటూ ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు వెళ్లి ప్రధాని మోడీ డీఎంకే, ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ దాని ‘ఘమాండియా’ కూటమికి సమస్యలు ఉన్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కి మాట్లాడే శక్తి లేదన్నారు. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఎన్నికల వ్యూహం అని పిలుస్తారు. అయితే, ఇలాంటి లక్షణం కాంగ్రెస్ మాత్రమే ఉంది’’ అని ప్రధాని మార్చి 11న అన్నారు.

ప్రధానిపై దాడిని కొనసాగిస్తూ ఉదయనిధి.. గతేడాది మైచాంగ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు ప్రభావితమైందని, ప్రధాని అక్కడికి వెళ్లలేదని ఆరోపించారు. మా సీఎం నిధులు కోరితే, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, రానున్న 22 రోజుల్లో ప్రతీ ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి బాధ్యత తీసుకుంటారని, మీరంతా డీఎంకేని గెలిపించాలని ఉదయనిధి ప్రజల్ని కోరారు.