
Snigdha reveals that Chandini Chowdary bet her due to a prank at Daawath Show: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జబర్ధస్త్ రీతూ చౌదరి హోస్టుగా దావత్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమం ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో నటి, సింగర్ స్నిగ్ధ పాల్గొంది. ఇక రీతూ చౌదరితో కలిసి రచ్చ చేసింది. అంతే కాదు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. ఇక షో ప్రోమో ప్రారంభంలో స్నిగ్ధ ఎంటర్ అవ్వగానే.. రీతూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించింది. దానికి ఎవరికో దురదృష్టం గట్టిగా రాసిపెట్టి ఉంటే తప్పదు అంటూ స్నిగ్ధ చెప్పుకొచ్చింది. అయితే అమ్మాయా, అబ్బాయా అంటూ రీతూ ప్రశ్న వేయగా.. ఎవరు మంచోళ్ళు మనకు, మన మనసుకు కనెక్ట్ అయితే అంటూ చెప్పుకొచ్చింది.
Snigdha: నన్ను రేప్ చేయబోయారు.. నాన్న మీద కూడా అనుమానమే?
ఇక 2023లో మీరు మర్చిపోలేని సంఘటన ఏది అని రీతు అడగ్గా.. బాత్రూం నుంచి బయటకు వస్తుంటే దొరికేశాను అని చెప్పింది. ఇక అమ్మాయా అబ్బాయా అని అడిగితే.. అమ్మాయి అంటూ స్నిగ్ద చెప్పి షాకిచ్చింది. అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ ఏంటి అని అడగ్గా.. కొన్ని నెలల క్రితం లివింగ్ ఉన్నాం.. తర్వాత గొడవలు కావడంతో విడిపోయాం అంటూ చెప్పి నవ్వులు పూయించింది.
మీ నోటి దూల వల్ల ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా అని అడిగితే.. దానికి స్నిగ్ధ మాట్లాడుతూ.. చాందిని చౌదరికి కాల్ చేసి గెస్ట్ హౌస్ కి రా అన్నాను. ప్రాంక్ కాల్ చేస్తే.. ఏడవడం మొదలుపెట్టేసింది. ఆ తర్వాత నేను రా బాబు అని చెప్తే.. ఎక్కడ ఉన్నావ్ అని అడిగి.. వచ్చి మరీ చితకొట్టిందంటూ చెప్పుకొచ్చింది స్నిగ్ధ. హీరోలతో ఎవరితోనైనా ప్రాంక్ చేశారా అంటే.. రాజ్ తరుణ్ తో చేశాను. ఎంతో బావుంటావో అని అడిగితే థాంక్స్ అన్నాడు. సో కలుద్దాం అని అడిగితే ఎక్కడ అని అడిగాడు. నేను అని తెలిసి పాపం ఎక్కింది అంతా దిగిపోయింది అని ఆమె చెప్పుకొచ్చింది.