
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ – డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది. యూట్యూబ్ వీడియోలు తొలగించిన జాబితాలో అమెరికా, రష్యా వంటి దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. 12,43,871 మిలియన్ల వీడియోల తొలగింపుతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. 7,88,354 మిలియన్ల వీడియోల తొలగింపుతో అమెరికా మూడో స్థానంలో ఉంది. 7,70,157 మిలియన్లలో ఇండోనేషియా నాలుగు, 5,16,629 మిలియన్లతో రష్యా ఐదో స్థానంలో నిలిచింది.
Read Also: Baltimore Bridge collapse: యూఎస్ బాల్టిమోర్ వంతెనను ఢీకొట్టిన నౌకలో సిబ్బంది అంతా భారతీయులే..
యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శాలను ఉల్లంఘించినందుకు ఈ కాలం(Q4 2023)లో యూట్యూబ్ 9 మిలియన్లకు పైగా వీడియోలను తీసేసింది. 96 శాతం వీడియోలను మనుషులు కాకుండా, మెషిన్స్ చేత గుర్తించబడ్డాయి. హానికరమైన, ప్రమాదకరమైన కంటెంట్, పిల్లల భద్రత, హింసాత్మక లేదా గ్రాఫిక్ కంటెంట్, న్యూడిటీ, లైంగిక కంటెంట్, తప్పుడు సమాచారం వాటితో పాటు ఇతర ప్రమాణాలను ఉల్లంగించినందుకు ఈ వీడియోలు తీసివేయబడ్డాయి. అక్టోబర్-డిసెంబర్ 2023 మధ్య భారత్‌లో 2,254,902 వీడియోల తొలగింపుతో 30 దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా, డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 20.5 మిలియన్ (20,592,341) ఛానెల్‌లను యూట్యూబ్ తీసేసింది. ఛానెల్ రద్దు చేయబడితే అందులో ఉండే అన్ని వీడియోలు తీసేయబడుతాయి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్.. ఎలాంటి వీడియోలను అనుమతించమనే మార్గదర్శకాలను కలిగి ఉంది. అశ్లీలత, హింసను ప్రేరేపించడం, వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటిని అనుమతించదు.