Leading News Portal in Telugu

Baltimore Bridge collapse: యూఎస్ బాల్టిమోర్ వంతెనను ఢీకొట్టిన నౌకలో సిబ్బంది అంతా భారతీయులే..



Dali

Baltimore Bridge collapse: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్‌ సమీపంలో కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కార్లు, అందులోని ప్రయాణికులు చల్లటి నీటిలో పడిపోయారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 948 అడుగుల కంటైనర్ షిప్ సింగపూర్ ఫ్లాగ్ కలిగిన డాలీ ఒక్కసారిగా వంతెనను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Viral Video : అరె ఎంట్రా ఇది.. గులాబ్ జామ్ తో ప్రయోగాలెంట్రా బాబు..

ఇదిలా ఉంటే కంటైనర్ షిప్ డాలీ నౌకా సిబ్బంది అంతా భారతీయులే అని తెలుస్తోంది. పూర్తిగా 22 మంది ఇండియన్ క్రూ చేత ఈ నౌక నిర్వహింపబడుతోందని డాలీని అద్దెకు తీసుకున్న షిప్పింగ్ కంపెనీ మెర్స్క్ ధ్రువీకరించింది. అయితే, ఈ ఘటన వెనక ఎలాంటి విద్రోహక కార్యచరణ లేదని, ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కి వివరించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్నప్పుడే నౌక ప్రొపల్షన్(చోదక శక్తి)ని కోల్పోయిందని, నౌకా సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయినట్లు మేరీ ల్యాండ్ అధికారులను ఉద్దేశిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది.

ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. 300 మీటర్ల పొడవున్న నౌక వంతెనకు సంబంధించిన ఒక పాదాన్ని ఢీకొట్టింది. దీంతో దాదాపుగా 20 మంది వ్యక్తులు బ్రిడ్జిపై నుంచి పటాన్‌స్కో నదిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. నౌక శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 1977లో మేరీల్యాండ్ లోని బాల్టీమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెన నిర్మితమైంది. అమెరికా జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి పేరుతో ఫ్రాన్సిస్ స్కాట్‌కి పేరు పెట్టారు. ప్రస్తుతం బ్రిడ్జిని ఢీకొట్టిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.