
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ని ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉంటే తన అరెస్ట్‌ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న తనను అరెస్ట్ చేయడం అక్రమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ రోజు విచారించిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కి ఊరట ఇవ్వలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 2లోగా స్పందించాలని ఈడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3కి విచారణ వాయిదా వేసింది.
Read Also: Kolkata: రన్‌వేపైకి ఒకేసారి రెండు విమానాలు.. తప్పిన పెద్ద ముప్పు
మార్చి 15న కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ సాయంత్రమే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలు జైలులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్‌కి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ వేదికగా కేజ్రీవాల్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.