
Anupama Parameswaran was upset about the comments: డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది సినిమా యూనిట్. అయితే ఈ ఈవెంట్ కి సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యాడు కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం హాజరు కాలేదు. అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అని సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని చెబుతూ నిన్న సినిమా యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది . ఆ పోస్టర్లో అనుపమ చెయ్యి సిద్దు శరీరం మీద ఉంటుంది. అయితే అది అసభ్యకరమైన స్థితిలో ఉందంటూ అనుపమ మీద బూతులతో కామెంట్లు పెట్టారు కొందరు నెటిజన్లు. ఆమె రాకపోవడానికి గల కారణం ఈ కామెంట్లేనని ఆయన అన్నారు.
Tillu Square Trailer: ఎలా పడతావ్‌రా టిల్లు ఇలాంటి జంబల్హాట్ లేడీస్‌ని?
హీరోలు హీరోయిన్లు అన్నాక సోషల్ మీడియాలో ట్రోల్స్ కి టార్గెట్ అవడం కామనే కానీ అది కొంతవరకే ఉండాలి అని సిద్దు అభిప్రాయపడ్డాడు. అలా అని నేను ఇప్పుడు మిమ్మల్ని ఆర్డర్ వేయలేను, అందుకని అభ్యర్థిస్తున్నాను దయచేసి ఇకమీదట హీరోయిన్లు కానీ ఇతర నటీమణులు కానీ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినప్పుడు కానీ ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు గాని వారి మీద ట్రోలింగ్ ఒక పరిమితి వరకు చేస్తే బెటర్. మనం ఎవరినైనా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లర్ట్ చేయడం అవతలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అలా కానప్పుడు అది బలవంతం చేస్తున్నట్లే అనిపిస్తుంది అని సిద్దు చెప్పుకొచ్చాడు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని చేయని వాళ్ళు మాట్లాడే మాటలు చేసే కామెంట్లు అవి అని అన్నారు. ఇక మీదట ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని ఆయన హితవు పలికారు.