Leading News Portal in Telugu

Kejriwal: సీఎం పదవి నుంచి తప్పించాలని పిటిషన్.. గురువారం విచారణ



Ke

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం దీనిపై న్యాయస్థానం విచారించనుంది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: Anupama: తన పోస్టర్‌పై బూతు కామెంట్లు.. టిల్లు స్క్వేర్ ఈవెంట్‌కి ముఖం చాటేసిన అనుపమ!

మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొంది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తారని ఆప్ మంత్రులు చెప్పారని పిటిషన్‌లో గుర్తుచేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ప్రభుత్వ విశ్వసనీయత.. ప్రతిష్టత దిగజారుతుందని పిటిషన్‌లో పేర్కొ్న్నారు.

ఇది కూడా చదవండి: Girl Suicide: మొదటి పీరియడ్‌తో ఇబ్బంది పడి బాలిక ఆత్మహత్య!.. అవగాహన లేమి కారణమా?

ఇదిలా ఉంటే అరెస్ట్, ఈడీ కస్టడీపై కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం న్యాయస్థానం విచారించి ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఇదే కేసులో గోవా ఆప్ లీడర్లకు కూడా ఈడీ తాజాగా సమన్లు అందించింది. గురువారం విచారణకు హాజరుకావాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: Maldives: మాల్దీవుల్లో తాగునీటి కష్టాలు.. టిబెట్‌ సాయం