
నీతా అంబానీ .. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. సినిమా స్టార్స్ కన్నా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినీ హీరోయిన్లు కూడా ఈమెను ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి.
అంతేకాదు నీతా అంబానీ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం.. టీమ్ లను కొనుగోలు చేస్తుందన్న విషయం తెలిసిందే.. అందుకే ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగిన అక్కడ ఆమె దర్శనం ఇస్తారు.. తాజాగా ఆమె హైదరాబాద్ లో దర్శనం ఇచ్చారు.. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న సందర్బంగా ఆమె హైదరాబాద్ కు విచ్చేసారు.. హైదరాబాద్ బల్కంపేట అమ్మవారినీ దర్శించుకున్నారు.. బుధవారం రాత్రి నీతా అంబానీ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఈవో కుంట నాగరాజు, చైర్మన్ కొత్తపల్లి సాయి గౌడ్, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు.. దాదాపు 15 నిముషాల పాటు నీతా అంబానీ ఆలయంలోనే గడిపింది.. అనంతరం ఉప్పల్ స్టేడియంకు వెళ్లింది.. అమ్మవారినీ దర్శించుకున్నపుడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..