Leading News Portal in Telugu

Chandrababu: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే..



Chandrababu

అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు. 9 సార్లు సీఎం జగన్ కరెంటు చార్జీలు పెంచారు.. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది.. ఇసుక అక్రమ రవాణా వెనుక తోపు ఉన్నాడు.. కియా పరిశ్రమ ఏపీకి రావటం మన రేంజ్.. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వాళ్ల రేంజ్ అన్నారు.. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వైసీపీకి ఇచ్చారు.. ఏం ఒరగపెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు.

Read Also: MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..

ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలి అని చంద్రబాబు కోరారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి.. సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తానని.. గోదావరిలో ముంచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి బ్రదర్స్ ఆరాచాలకు అడ్డు లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన దోపిడీలు, కమిషన్ లే.. తోపుదుర్తి బ్రదర్స్ దెబ్బకు జాకీ పరిశ్రమ ఎగిరి తెలంగాణలో పడింది అని ఆయన ఆరోపించారు. తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు ఆటోనగర్ భూములు కూడా మింగేయాలి అనుకున్నారు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టను..వడ్డీతో సహా చెల్లిస్తాం.. తోపుదుర్తి అక్రమాలు, అరాచకాలపై విచారణ జరిపిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. 140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. నేను అందరి వాడిని.. ఏ ఒక్కరి కోసం పని చేయడం లేదు అని చంద్రబాబు వెల్లడించారు.