Leading News Portal in Telugu

Manamey: “ఇక న మాటే మాట ఇంకా” మనమే ఫిస్ట్ సింగల్ రిలీజ్…



Manamey First Single Released: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్.వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను నటించిన మహానుభావుడు తరువాత చాల సినిమాలు చేసినప్పటికీ చెప్పుకో దగినవిగా ఏవి శర్వా కి గుర్తింపు తీసుకుని రాలేదు. తాను చేసిన లాస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ అంటూ చేసిన తమిళ -తెలుగు బైలింగ్వెల్ మూవీ  గా విడుదల చేసారు. తమిళ్ లో బాగానే వర్కౌట్ అయినా తెలుగులో పెద్దగా ఆడలేదు. దాని తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “మనమే”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రీకొడుకుల మధ్య జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read; Naga Chaitanya : ఆ మూవీ నాకు చాలా ప్రత్యకమైనది.. నాగచైతన్య

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ లిరికల్ సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. “ఇక న మాటే మాట ఇంకా ” అంటూ సాంగ్ ఆకట్టుకుంటుంది. లిరిక్స్ కృష్ణ చైతన్య వ్రాయగా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సాంగ్ కు తానే స్వరం అందించారు. మంచి ఫస్ట్ బీట్ తో యూత్ ని ఉర్రుతలు ఊగించాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది.ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. కృతి ప్రసాద్ మరియు ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాపై శర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.