Leading News Portal in Telugu

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ దాతృత్వం.. భారత సంతతి డాక్టర్‌‌కు భారీ సాయం!



Elon Musk

కోవిడ్ మనుషుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడిందో అందరికీ తెలిసిందే. దాని బారిన పడిన వాళ్లు ఎందురో మృత్యువాతపడ్డారు. అనేక కుటుంబాల్లో విషాదాలు నింపింది. ఇక కరోనా కాలంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధించడంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పటికీ మరిచిపోలేని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆయా సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వైద్యులైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చూశాం. అలా మాట్లాడిన వారు చిక్కుల్లో కూడా పడ్డారు. కెనడాలో భారత సంతతికి చెందిన ఓ వైద్యురాలు కూడా ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు గుప్పించి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Arvind Kejriwal Arrest: భారత్ హెచ్చరికతో మారిన జర్మనీ స్వరం..

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసిన కెనడాలోని ఓ వైద్యురాలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో ఆమె ఇబ్బందులు పాలయ్యారు. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. కోర్టులో దావా వేశాయి. ఫలితంగా మహిళా వైద్యురాలు ఆ ఫీజులు భరించలేక నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో వైద్యురాలకు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అండగా నిలిచారు. తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Ram Charan: డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా కెనడా ప్రభుత్వం 2020లో లాక్‌డౌన్లు విధించింది. అనంతరం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసింది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడటంతో భారత సంతతి వైద్యురాలు కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. దీంతో వైద్యవర్గాలు, మీడియా ఆమెపై కోర్టుకు వెళ్లాయి. దీన్ని సవాల్‌ చేసిన కుల్విందర్‌.. తనపై కావాలనే కుట్రపూరితంగా బురద జల్లుతున్నారని న్యాయస్థానంతో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబట్టింది. వారి లీగల్‌ ఖర్చులన్నీ కలిపి మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.1.85 కోట్లు) చెల్లించాలని ఆమెకు ఆదేశించింది. దీనికి ఈ మార్చి 31 గడువుగా విధించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆమె ఖంగుతింది. ఇప్పటి వరకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడానికే తాను సంపాదించిందంతా ఖర్చయిపోయిందని కుల్విందర్‌ వాపోయారు. పైగా అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahabubnagar: ముగిసిన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

కోర్టు విధించిన జరిమానా చెల్లించడానికి ఆన్‌లైన్‌ వేదికగా నిధుల సమీకరణను ఆమె ప్రారంభించారు. దీంతో ఆమెకు దాతలు మద్దతుగా నిలిచారు. ఇప్పటి వరకు రెండు లక్షల కెనడా డాలర్లకు పైగా సమకూర్చారు. ఈ విషయం ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ దృష్టికి వెళ్లింది. వాక్‌ స్వాతంత్ర్యాన్ని రక్షించడంలో భాగంగా ఆమెకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని తాను అందజేస్తానని హామీ ఇచ్చారు.