Leading News Portal in Telugu

Sasidavane : గోదారి అటు వైపో అంటున్న శశివదనే హీరో!



Sashivadane

Godari Atu Vaipo song from Sasidavane Released: ‘‘గోదారి అటు వైపో, నాదారి ఇటు వైపో అమ్మాయి నీదారెటువైపో…’’ అంటూ అమ్మాయిని చూసి శశివదనే హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుందని అంటున్నారు మేకర్స్. అమ్మాయి కోసం వెతికే అబ్బాయి అన్వేషణ తెలుసుకోవాలంటే శశివదనే సినిమా చూడాల్సిందే అంటున్నారు. ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు.

Anupama: టిల్లు స్క్వేర్‌పైనే అనుపమ ఆశలు.. రైటో రాంగో?

గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించగా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టూ విస్సాప్రగడ రాశారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.