Leading News Portal in Telugu

Karnataka: కాంగ్రెస్- బీజేపీ ఒక్కటే.. నోటాకే మా ఓటు..



Karnataka

కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందు కోసం లోక్‌సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తాన్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రాష్ట్రంలోని రైతులను కోరుతూ ప్రచారాన్ని చేస్తున్నాయి.

Read Also: Nallamilli Ramakrishna Reddy: ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్‌ దక్కకపోవడంతో..!

ఇక, ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా రైతులకు చేసిందేమీ లేదు.. ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేద అనే భావనతో పలు రైతు సంఘాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సంఘటితం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్‌ 3వ తేదీన రైతు సంఘాల సమావేశం జరగబోతుంది.

Read Also: Summer Record: వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అయితే, ఈ మీటింగ్ లోనే లోక్‌ సభ ఎన్నికల్లో రైతు సంఘాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నోటాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రతి పాధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏప్రిల్‌ 3న తుది నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.