Leading News Portal in Telugu

South Africa: లోయలో పడ్డ బస్సు.. 45మంది దుర్మరణం



New Project (80)

South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది. వంతన పై నుంచి అదుపు తప్పి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం బస్సులో 46 మంది ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడిన తర్వాత మంటలు చెలరేగాయి. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

Read Also:Tillu Square Twitter Review: టిల్లు అన్న మ్యాజిక్ రిపీటా? సినిమా హిట్టేనా?

46 మందితో కూడి బస్సు బోట్స్‌ వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఈ క్రమంలోనే కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. బస్సు డ్రైవర్‌ కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు వంతెనపై నుంచి 165 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా 45 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే.. బస్సు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బస్సు లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు.

Read Also:Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..

ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లింపోపోలోని ఈశాన్య ప్రావిన్స్‌లోని మమట్లకల సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై ఉన్న అడ్డంకులను ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడి మంటలు వ్యాపించాయని రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో పాటు.. మరికొందరు శిథిలాల లోపల చిక్కుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరుదేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు. మరోవైపు ఈస్టర్‌ వీకెండ్‌ సందర్భంగా వంతెనపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుందనీ.. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.