Leading News Portal in Telugu

Maldives: గత అధ్యక్షుడు ఓ “విదేశీ రాయబారి” చెప్పినట్లు విన్నాడు: మహ్మద్ ముయిజ్జూ..



Maldives

Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.

తాజాగా మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌పై విమర్శలు గుప్పించారు. సోలిహ్ భారత దేశానికి మంచి మిత్రుడు. అధ్యక్షుడు ముయిజ్జూ మాట్లాడుతూ.. సోలిహ్ తన పదవీ కాలంలో ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పనిచేశారని ఆరోపించారు. దేశ స్వతంత్రతను విదేశాల చేతిలో పెట్టాడంటూ మండిపడ్డాడు. టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సోలిహ్‌పై వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

2018-23 వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, దేశ స్వతంత్రను కాపాడటంలో విఫమైందని ఆరోపించారు. దేశాన్ని విదేశీ చేతుల్లో పెట్టాడని ఆరోపించారు. ఆర్థికంతో సహా అన్ని విషయాల్లో స్వాతంత్ర్యాన్ని కోల్పోయామని, ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, మేం చేస్తున్న ప్రయత్నాలను వారు అంగీకరించరని ముయిజ్జూ అన్నారు.

గత అధ్యక్షుడు సోలిహ్ ప్రభుత్వం చాలా విషయాల్లో భారత్‌కి మంచి మిత్రుడిగా ఉన్నారు. చైనాను కాదని భారత అనుకూల విధానాలను అనుసరించారు. పాలనాపరంగా భారత్‌పై సోలిహ్ ఆధారపడ్డారని ప్రస్తుతం ముయిజ్జూకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎన్సీ) ఆరోపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే పరోక్షంగా భారత్ గురించి ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాడని తెలుస్తోంది. భారత్‌ని ఇన్నాళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ముయిజ్జూ ఇటీవల మాట్లాడుతూ.. రుణాల నుంచి విముక్తి పొందేందుకు భారత్ తమకు ఎన్నటికి మిత్రదేశమని వ్యాఖ్యానించారు. రుణాల నుంచి విముక్తి కోరుతున్నట్లు తెలిపారు.