Leading News Portal in Telugu

Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..



Yathindra

Amit Shah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు, కాంగ్రెస్ నేత యతీంద్ర, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. యతీంత్రపై బీజేపీ శుక్రవారం ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. గురువారం చామరాజనగరలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో వరుణ మాజీ ఎమ్మెల్యే యతీంద్ర మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని నడిపిందో మీకందరికి తెలుసని, కేంద్ర హోంమంత్రి ఓ గుండా, రౌడీ అని అన్నారు.

Read Also: Russia: ఉత్తర కొరియా కోసం రష్యా ఏం చేసిందంటే..!

గుజరాత్ అల్లర్లకు సంబంధించి అతడిపై హత్యానేరాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తి పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోడీ అంటూ వ్యాఖ్యానించారు. ముస్లింలపై మారణహోమానికి పాల్పడ్డారనే అతిపెద్ద అభియోగం ఉందని, ఇలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారని యతీంద్ర అన్నారు.

యతీంద్ర వ్యాఖ్యలపై శుక్రవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. హోంమంత్రిపై ఇలాంటి విద్వేశపూరిత ప్రసంగం చేసినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులను డిమాండ్ చేశార. యతీంద్ర వ్యాఖ్యల్ని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఖండించారు. మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కుమారుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.