Leading News Portal in Telugu

Delhi: సోనియాను కలిసిన కల్పనా సోరెన్.. తాజా పరిణామాలపై చర్చ



Soniya

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్త హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానాన్ని సోనియాకు వివరించారు. జనవరిలో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు నెలల నుంచి హేమంత్ సోరెన్ జైల్లోనే ఉన్నారు.

 

Sunitha

కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం ఇండియా కూటమి ఢిల్లీలో తలపెట్టిన మహా ర్యాలీ కోసం కల్పనా సోరెన్ శనివారం దేశ రాజధానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం సునీతా కేజ్రీవాల్‌ను ఆమె నివాసంలో కలుసుకుని సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్, హేమంత్ సోరెన్ అరెస్ట్ అంశాలపై ఇరువురు చర్చించారు. కలిసి పోరాటం చేయాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇక శనివారం సాయంత్రం సోనియాను కలిసి తాజా పరిణామాలను కల్పనా సోరెన్ వివరించారు.

ఇది కూడా చదవండి: WhatsApp: +92 కాల్స్ వస్తున్నాయా.. జాగ్రత్త ..! ఈ నంబర్‌ నుంచి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేయొద్దు

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కూటమిలో ఉన్న అన్ని పార్టీల ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఈ మహా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కల్పనా సోరెన్, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌​ఓబ్రెయిన్‌, డీఎంకే నేత తిరుచ్చి శివ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ పాల్గొంటారు. ఈ ర్యాలీలో కేంద్రం తీరు, ఈడీ దాడులపై నేతలు ధ్వజమెత్తనున్నారు. దీంతో పాటు ఎలక్టోరల్ బాండ్ అంశం, ఐటీ నోటీసులు, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులపై లేవనెత్తారు.

ఇది కూడా చదవండి: Chandrababu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. అయితే తమ దేశ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం సూచించింది. హేమంత్ సోరెన్‌ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇంకా ఆయనకు బెయిల్ లభించలేదు. మొత్తానికి ఢిల్లీ వేదికగా ఆదివారంపై కేంద్రం అనుసరిస్తున్న పోకడలపై ఇండియా కూటమి ధ్వజమెత్తనుంది.

ఇది కూడా చదవండి: Heavy rain alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల